
సాక్షి, చైన్నై: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అతి తక్కువ మంది చిన్ని తారలు ఓటు వేయలేకపోయారు. అందులో నటుడు, దర్శకుడు పార్థిబన్ ఒకరు. కాగా పార్థిబన్ ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి గల కారణాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా వివరించారు. అందులో ఆయన పేర్కొంటూ తాను ఇటీవల కోవిడ్ వ్యాక్సిన్‌ను రెండవ సారి వేసుకున్నానన్నారు.
అయితే వ్యాక్సిన్ కారణంగా ఎలర్జీ కలిగి ముఖమంతా వాచిపోయిందన్నారు. దీంతో తన ఫొటోలు వైద్యులకు పంపి వైద్య చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే తాను ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని వివరించారు. అయితే అందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, అతి కొద్ది మందికి మాత్రమే వ్యాక్సిన్ కారణంగా ఎలర్జీ కలుగుతుందని, తనకు ఇంతకు ముందే ఎలర్జీ సమస్య ఉండడంతో ఇలా జరిగిందని పార్థిపన్ తెలిపారు.
చదవండి: అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా!
Comments
Please login to add a commentAdd a comment