german woman petition actor arya over cheating case - Sakshi
Sakshi News home page

నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు!

Published Sun, Mar 28 2021 8:54 AM | Last Updated on Sun, Mar 28 2021 1:09 PM

German Woman Petition Of  Actor Arya Over Cheating Case - Sakshi

సాక్షి, చెన్నై: తమిళ నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయకూడదని శ్రీలంకకు చెందిన మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జెమినిలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన ఓ యువతి ఆర్య తనను వివాహం చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ పీఎం, సీఎం, హోం మినిస్టర్‌ కార్యాలయాలకు లేఖ రాశారు.

దీంతో ఆర్య అనుచరుడు మహమ్మద్‌ అర్మన్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్‌ ఇవ్వకూడదని కోరుతూ యువతి మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌  శుక్రవారం న్యాయమూర్తి సెల్వ కుమార్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణను ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేశారు.
చదవండి: షారుఖ్‌తో సినిమా.. ముంబైలో ఆఫీస్‌ వెతుకుతున్న డైరెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement