కరోనాపై నవ్వుతూనే పోరాడాలి అని అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ఇది కరోనా కాలం అని పేర్కొనవచ్చు. ఈ మహమ్మారి ప్రపంచదేశాలనే భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎప్పుడు ఎవరి ప్రాణాలు అరిస్తుందో తెలియని భయానక పరిస్థితుల్లో మానవాళి బతుకుతున్నారు. దీంతో ప్రజలు ప్రతి క్షణం అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సెలబ్రిటీలు ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తున్నారు. కాగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా తనదైన బాణీలో కరోనా గురించి సలహా ఇచ్చింది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్న నటి రకుల్‌ప్రీత్‌సింగ్. (భారత్ @ 519)
ప్రస్తుతం తమిళంలో ఇండియన్–2, శివకార్తికేయన్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. హిందీలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు కరోనా వైరస్ ప్రభావం ఉన్న తరుణంలోనూ కొన్ని రోజులు షూటింగ్ చేసిందట. దీని గురించి ఈ అమ్మడు చెబుతూ ఇంటి నుంచి బయటకు కాలు పెడుతుంటే ఏదో పోరుకు బయలుదేరుతునట్టుగా ఉందంది. అందుకు కారణం కరోనా భూతమేనంది. కాబట్టి ఎవరూ అత్యవసరం అనుకుంటే కానీ బయటకు రావద్దని చెప్పింది. తాను ఇటీవల తప్పనిసరి కావడంతో ముందు జాగ్రత్తలు తీసుకుని తక్కువ మంది చిత్ర యూనిట్‌తో షూటింగ్‌లో పాల్గొన్నట్లు చెప్పింది. (దండం పెడుతున్నా.. బయటకు రావొద్దు)
ఆ సమయంలో తన టీమ్‌ను మినహా ఎవరినీ కారవన్‌లోకి అనుమతివ్వలేదని చెప్పింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు తాను చాలా బిజిగా ఉండాల్సిందని, అయితే అంతా మారిపోయిందని అంది. కరోనా కారణంగా తాను నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్‌లు ఏప్రిల్ నెలకు వాయిదా పడినట్లు చెప్పింది. ఇప్పటికీ ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొంది. నటిగా తన జీవితంలో ఏర్పడిన పెద్ద విరామం ఇదేనని చెప్పుకొచ్చింది. ఏదేమైనా అందరూ కరోనాపై నవ్వుతూనే పోరాడాలని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ముఖ్యంగా దీన్ని ఎవరూ అలక్ష్య పరచరాదని, ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment