నయనతార లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా విజయం సాధించిన చిత్రాలలో కోలమావు కోకిల ఒకటి. ఆమెకు వన్‌సైడ్ లవర్‌గా నటుడు యోగిబాబు నటించారు. ఆ చిత్రం ఆయనకు హీరో ఇమేజ్ తెచ్చి పెట్టింది. నయనతార చుట్టూ తిరిగే కథా చిత్రంలో యోగిబాబుది కీలకపాత్ర. 2018లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఒక ముఖ్య అంశానికి హాస్యం జోడించి తెరకెక్కించిన చిత్రం కోలమావు కోకిల.
ఈచిత్రంతో దర్శకుడుగా పరిచయమైన నెల్సన్ ఇప్పుడు రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. కాగా నయనతార, యోగిబాబు మళ్లీ కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ఇంతకుముందు కార్తీక్ హీరోగా సర్దార్, శశికుమార్ కథానాయకుడిగా ఆర్జే బాలాజి హీరోగా రన్ బేబీ రన్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం ద్వారా విక్కీ అనే నవ దర్శకుడు పరిచయం కానున్నట్లు సమాచారం.
ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్ పైకి వెళ్లనున్నట్లు సినీవర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్‌ఖాన్ సరసన హిందీలో జవాన్ చిత్రంలో నటిస్తున్న నయనతార తర్వాత తన 75వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు అదేవిధంగా వై నాట్ పిక్చర్స్ పతాకంపై శశికాంత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్‌లతో కలిసి నటించనున్నారు. ఇది కథానాయకుడు ప్రాధాన్యత కలిగిన కథా చిత్రం అని దర్శక నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. వీటితోపాటు మరికొన్ని అవకాశాలు నయనతార కోసం ఎదురుచూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment