రూమర్స్‌పై స్పందించిన సంపూర్ణేశ్‌ బాబు | Actor Sampoornesh Babu Responds Rumors Over Movie Offers In Martin Luther King Promotions, Deets Inside - Sakshi
Sakshi News home page

Sampoornesh Babu: రూమర్స్‌పై స్పందించిన సంపూర్ణేశ్‌ బాబు

Published Thu, Oct 26 2023 9:12 AM | Last Updated on Thu, Oct 26 2023 9:37 AM

Sampoornesh Babu Responds Rumors - Sakshi

సంపూర్ణేష్‌బాబు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.  హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టి బుల్లితెర ద్వారా ప్రతి ఇంటికి పరిచయం అయ్యాడు. తాజాగా సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రలో 'మార్టిన్‌ లూథర్‌ కింగ్‌' అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో సంపూర్ణేష్‌బాబు రానున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండగా ఇప్పటి వరకు తనపై వస్తున్న రూమర్స్‌కు ఆయన స్పందించాడు.

'ఇండస్ట్రీలో కొందరు మిమ్మల్ని తొక్కేయడం వల్లే మీరు పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. నిజమేనా?’ అని హోస్ట్‌ ప్రశ్నించగా అలాంటిదేం లేదని సంపూర్ణేశ్‌ బాబు తెలిపాడు. తాను అందరితోనూ మంచిగానే ఉంటానని నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదన్నాడు. తనకు అనారోగ్యం వల్ల సినిమాలు చేయడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అందులో కూడా నిజం లేదని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ రిలీజ్‌ తర్వాత నెలల వ్యవధిలోనే అవి ప్రేక్షకుల ముందుకొస్తాయని తెలిపారు.

తమిళంలో ఘన విజయం సాధించిన 'మండేలా' చిత్రానికి 'మార్టిన్‌ లూథర్‌ కింగ్‌' రీమేక్‌. పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీగా రూపొందిన ఈ సినిమాలో 'కేరాఫ్‌ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్‌ మహా, నరేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. తమిళంలో యోగిబాబు తన నటనతో మండేలా సినిమాను నిలబెట్టాడు. తనదైన కామెడీతో పాటు, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మరి తెలుగులో సంపూర్ణేష్‌బాబు ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. అక్టోబర్‌ 27న ఈ  సినిమా విడుదలకు రెడీగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement