'మార్టిన్ లూథర్ కింగ్'గా రాబోతున్న సంపూర్ణేష్ బాబు.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Martin Luther King Movie Release Date Out | Sakshi
Sakshi News home page

'మార్టిన్ లూథర్ కింగ్'గా రాబోతున్న సంపూర్ణేష్ బాబు.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sat, Oct 14 2023 4:54 PM | Last Updated on Sat, Oct 14 2023 4:54 PM

Martin Luther King Movie Release Date Out - Sakshi

సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్  ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’.  మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందన లభించింది.

తెలుగు సినిమాలలో ఇదో కొత్త అనుభూతిని అందిస్తుందని. అలాగే ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు నటుడిగా ఆకర్షణీయమైన ఓ కొత్త పాత్రలో అలరించనున్నారని చిత్ర యూనిట్‌ పేర్కొంది. అక్టోబర్‌ 27న ఈ ఈ చిత్రం విడుదల కాబోతుందని మేకర్స్‌ ప్రకటించారు. 

'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement