
ప్రస్తుతం నటుడు యోగిబాబు లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క కథనాయకుడిగానూ బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రాల్లో బొమ్మై నాయకి ఒకటి. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ నీలం ప్రొడక్షన్స్, వారినీ ఫిలిమ్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. కథా, కథనం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ సుందర్ సంగీతాన్ని, అదిశయరాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
కాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఇటీవల ఒక పాటను విడుదల చేసినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంలోని మరో పాటను శుక్రవారం విడుదల చేస్తామన్నారు. అదే విధంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బొమ్మై నాయకి చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. చిత్ర కథా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment