
ఇన్ని రోజులూ దర్శకులు యాక్షన్ చెప్పగానే యాక్షన్ చేసిన ‘జయం’ రవి త్వరలోనే స్టార్ట్ కెమెరా, యాక్షన్ అనడానికి రెడీ అయ్యారు. త్వరలోనే దర్శకుడిగా మారతానని రవి ప్రకటించారు. ప్రస్తుతం యాక్టర్‌గా ఫుల్ బిజీబిజీగా ఉంటూ మంచి సక్సెస్‌లు అందుకుంటున్నారు ‘జయం’ రవి. హీరోగా 25 సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్ చైర్‌లో కూర్చోడానికి సిద్ధమయ్యారు. అయితే తన డైరెక్షన్‌లో తాను యాక్ట్ చేయరట. కమెడియన్ యోగిబాబును మెయిన్ లీడ్‌గా తీసుకొని ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ప్రస్తుతం యాక్టర్‌గా ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక డైరెక్టర్‌గా తన తొలి సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment