
విజయ్
ఈ ఏడాది దీపావళికి థియేటర్స్‌లోకి కొత్త సర్కార్ రానుంది. హీరో విజయ్ ఈ సర్కార్‌కు లీడర్. ‘కత్తి, తుపాకీ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న సినిమాకు ‘సర్కార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కీర్తీ సురేశ్ హీరోయిన్. వరలక్ష్మీ శరత్‌కుమార్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు.
విజయ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ త్రీ లుక్స్‌లో కనిపించనున్నారట. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. విజయ్, వరలక్ష్మీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘విజయ్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘కత్తి, తుపాకీ’ చిత్రాల కన్నా ‘సర్కార్’ ఇంకా సూపర్‌గా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్ప గలను’’ అన్నారు మురుగదాస్.
Comments
Please login to add a commentAdd a comment