Yogi Babu New Movie 'Vaanavan' Motion Poster Launched - Sakshi
Sakshi News home page

Yogi Babu: కమెడియన్‌ యోగి బాబు హీరోగా వానవన్‌.. మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

Jul 24 2023 10:18 AM | Updated on Jul 24 2023 10:32 AM

Yogi Babu New Movie Vaanavan Motion Poster Launched - Sakshi

అదే సమయంలో యోగిబాబు స్టైల్‌లో వినోద భరిత సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. అందరినీ అలరించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

కథానాయకుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు యోగిబాబు. ఇతడు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వానవన్‌. ఎడెన్‌ ప్లిక్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై థామస్‌ రెన్ని జార్జ్‌ నిర్మిస్తున్నాడు. ఈయన గత ఏడాది సాయిపల్లవి నటించిన గార్గి సినిమాకు సహ నిర్మాత అన్న విషయం తెలిసిందే! మలయాళ దర్శకుడు సజన్‌ కె.సురేంద్రన్‌ వానవన్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో యోగిబాబుతో పాటు రమేష్‌ తిలక్‌, కాళీ వెంకట్‌, లక్ష్మీ ప్రియా, చంద్రమౌలి, మాస్టర్‌ శక్తి రిత్విక్‌, లవ్‌ టుడే ప్రార్థన నాదన్‌, కల్కి రాజా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది ఫీల్‌గుడ్‌ ఫాంటసీ చిత్రంగా ఉంటుందని డైరెక్టర్‌ సజన్‌ చెప్తున్నారు. అదే సమయంలో యోగిబాబు స్టైల్‌లో వినోద భరిత సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. అందరినీ అలరించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ప్రేక్షకులందరికీ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర షూటింగ్‌ మధురై, చైన్నెలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షూటింగ్‌ చివరి దశకు చేరుకుందన్నారు. కాగా శనివారం యోగిబాబు పుట్టిన రోజు సందర్భంగా వానవన్‌ చిత్ర టైటిల్‌ను, మోషన్‌ పోస్టర్‌ను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌, మావీరన్‌ చిత్ర దర్శకుడు మడోన్నా అశ్విన్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.

చదవండి: ఇప్పట్లో 'గుంటూరు కారం' కష్టాలు తీరవా..? మహేష్‌ క్లారిటీ ఇవ్వాల్సిందేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement