నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లక్కీమ్యాన్. నటి రేచ్చల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి నటుడు బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు తాను దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ పానీపూరికి మంచి ఆదరణ లభించిందన్నారు. తాజాగా లక్కీమ్యాన్ చిత్ర కథను నటుడు యోగిబాబుకు చెప్పగా వెంటనే నటించడానికి అంగీకరించారన్నారు.
యోగిబాబును ఇండియన్ నటుడు అని చెప్పవచ్చునన్నారు. అంతటి ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ఆయన గురించి ఇటీవల పలు వదంతులు ప్రచారం అవుతున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. యోగిబాబు ఇంటిలో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా, షూటింగ్‌కు ఇబ్బంది కలుగుతుందని, కష్టాన్ని భరిస్తూనే తమ చిత్రంలో నటించారన్నారు. కాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్ శక్తివేల్‌కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.
నటుడు యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ చెప్పినట్లుగా ఈ చిత్రం తన జీవితాన్ని తిరిగి చూసుకునేట్లు ఉందన్నారు. ఇంతకు ముందు తాను కొన్ని చిత్రాల్లో నాలుగైదు సన్నివేశాల్లో నటించినా తన పేరును ప్రచారానికి వాడుకోవడం అభిమానులను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. దాని గురించి అడిగితే సమస్యగా మారుతోందన్నారు. తాను షూటింగ్‌లకు సరిగా రావడం లేదనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. షూటింగ్‌కు రాకుండా తానెక్కడికి వెళతానన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. తాను కథలను విని కాకుండా వారి కష్టాలను విని నటిస్తున్నానని యోగిబాబు వెల్లడించారు.
చదవండి: చిన్నాచితకా పాత్రలకు సైతం కాంప్రమైజ్.. కెరీర్ కోసం నేనూ అడ్జస్ట్ అయ్యా..: నటి
Comments
Please login to add a commentAdd a comment