Dhoni’s Debut Film LGM Movie Review and Rating Telugu - Sakshi
Sakshi News home page

LGM Movie Review: 'ఎల్‌జీఎమ్' ఎలా ఉంది? రివ్యూ ఏంటి?

Jul 30 2023 3:00 PM | Updated on Jul 30 2023 3:17 PM

LGM Movie Review Dhoni First Cinema - Sakshi

టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో అద్భుతాలు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అంతర్జాతీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు పలు వ్యాపారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలా సినిమాల్లోకి వచ్చాడు. నిర్మాతగా తమిళంలో ఫస్ట్ మూవీ తీశాడు. మరి దీని టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?

'ఎల్‌జీఎమ్' కథేంటి?
గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు. అయితే అత్తతో కలిసి ఉండటానికి మీరా నో చెబుతుంది. దీంతో గౌతమ్.. మన వివాహం కుదరదని అంటాడు. దీంతో రాజీకొచ్చిన మీరా.. అత్త(నదియా)ని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి వారం రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ట్రిప్‌కి వెళ్లిన మీరాతో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు. చివరకు ఏమైంది? అనేది స్టోరీ.

(ఇదీ చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి.. రెండో పెళ్లి చేసుకుందా?)

టాక్ ఏంటి?
తమిళ ఆడియెన్స్, నెటిజన్స్ చెబుతున్న దాని ప్రకారం 'ఎల్‌జీఎమ్' చాలా బోరింగ్‌గా ఉందని అంటున్నారు. రెండున్నర గంటలపాటు నిడివితో ఉన్న ఈ సినిమాలో చాలాసేపు ప్రేమకథనే చూపడం, కూర్చుని మాట్లాడుకోవడం లాంటి సీన్స్ వల్ల విసుగొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదని, కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చినట్లు సమాచారం.

తెలుగు సంగతేంటి?
తమిళంతోపాటు తెలుగులోనూ జూలై 28నే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'బ్రో' వల్ల ప్లాన్ మార్చుకున్నారు. ఓ వారం ఆలస్యంగా అంటే ఆగస్టు 4న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 'ఎల్‌జీఎమ్' రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో హరీశ్ కల్యాణ్, ఇవానా, నదియా ప‍్రధాన పాత్రల్లో నటించారు. తమిళమణి దర్శకుడు. మరి తమిళంలో తేడా కొట్టేసిన ఈ సినిమా తెలుగులో ఏ మేరకు టాక్ తెచ్చుకుంటుందనేది చూడాలి. 

(ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్‌ ఆది పెళ్లి ఫిక్స్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement