MS Dhoni Wife Sakshi Dhoni Says She Has Big Fan Of Allu Arjun At LGM Movie Press Meet, Video Viral- Sakshi
Sakshi News home page

Sakshi Dhoni On Allu Arjun: అల్లు అర్జున్‌ సినిమాలన్నీ చూస్తా.. ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని : సాక్షి

Published Mon, Jul 24 2023 7:32 PM | Last Updated on Tue, Jul 25 2023 1:55 PM

Sakshi Dhoni Big Fan Of Icon Star Allu Arjun Goes Viral

టీమిండియా లెజెండ్ క్రికెటర్ ఎంఎస్‌ ధోని ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై సాక్షి ధోని నిర్మాతగా తమిళంలో ఎల్‌జీఎం (లెట్స్‌ గెట్‌ మ్యారీ)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమేష్‌ తమిళమణి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హరీష్‌ కల్యాణ్‌, నటి ఇవాన జంటగా నటించిన ఈ చిత్రంలో నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

(ఇది చదవండి: సహ నటుడిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్!)

 ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. తాజాగా హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌కు ధోని భార్య, చిత్ర నిర్మాత సాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

మీరు తెలుగు హీరోల సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించగా.. సాక్షి బదులిచ్చింది. తాను ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు చూశానని.. కానీ అల్లు అర్జున్ సినిమాలైతే అన్ని చూస్తానని అన్నారు. నేను బన్నీకి పెద్ద ఫ్యాన్‌ అని సాక్షి తెలిపారు. ఈ సమాధానం చెప్పాగానే ఫ్యాన్స్ పెద్దఎత్తున సందడి చేశారు. ప్రస్తుతం సాక్షి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ భారీ ఎత్తున వైరల్ చేస్తున్నారు.

(ఇది చదవండి: ధోనీ నిర్మాతగా ఫస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement