MS Dhoni Debut Production, LGM Movie Audio And Trailer Launched In Chennai, Deets Inside - Sakshi
Sakshi News home page

LGM Movie Trailer: ట్రైలర్ ఆగయా.. తెలిసిన స్టోరీనే కానీ!

Published Mon, Jul 10 2023 9:24 PM | Last Updated on Tue, Jul 11 2023 9:35 AM

dhoni first tamil film - Sakshi

Dhoni LGM Movie Trailer: స్టార్ క్రికెటర్ మహేంద‍్ర సింగ్ ధోనీ మొన్నటివరకు గ్రౌండ్ లో సిక్సులు కొట్టాడు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొట్టడానికి రెడీ అయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. క్రికెటర్ గా ఎంతో పేరు తెచ‍్చుకున్న మహీ.. తమిళంలో నిర్మాతగా తొలి సినిమా తీస్తున్నాడు. 'LGM' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇది కాస్త ఫన్ క్రియేట్ చేస్తూనే అలరిస్తోంది.

(ఇదీ చదవండి: ఒక్క ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!)

ధోనీ చాలారోజుల తర్వాత మళ్లీ చెన్నైలో కనిపించాడు. ఈసారి క్రికెటర్‌గా కాదు నిర్మాతగా దర్శనమిచ్చాడు. సోమవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భార్య సాక్షితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ధోనీ ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ స్థాపించిన తర్వాత తొలి మూవీ తమిళంలోనే తీస్తున్నాడు.  'LGM' (లెట్స్ గెట్ మ్యారీడే) పేరుతో తీస్తున్న ఈ మూవీలో హరీశ్ కల్యాణ్, ఇవానా, నదియా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి-ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీశారు.

LGM కథేంటి?
గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు. అయితే అత్తతో కలిసి ఉండటానికి మీరా నో చెబుతుంది. దీంతో గౌతమ్.. మన వివాహం కుదరదని అంటాడు. దీంతో రాజీకొచ్చిన మీరా.. అత్త(నదియా)ని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో మీరాతో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు. చివరకు ఏమైంది? అనేది స్టోరీ.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement