ఇప్పటి వరకూ క్రికెట్‌లో దుమ్ము రేపిన క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని ఇప్పుడు చిత్ర నిర్మాణంలో ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈయన ధోని ఎంటర్‌టైన్‌మెంట్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి 'ఎల్‌జీఎం' అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. హరీష్ కల్యాణ్, ఇవనా జంటగా నటించిన ఇందులో నటి నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే)
రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న విడుదల కానుంది. ఇదంతా తెలిసిన కథే. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన ధోనీ అక్కడితో ఆగలేదు. ఈ చిత్రంతో ఆయన నటుడిగానే అవతారమెత్తారు. తాజా సమాచారం. నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం చివరి ఘట్టంలో రోలెక్స్ పాత్రలో నటుడు సూర్య మెరిసిన విషయం తెలిసిందే. అది 10 నిమిషాల గెస్ట్ పాత్ర అయినా సూర్య అభిమానుల్లో రోలెక్స్ పాత్ర పెద్దగా ముద్ర వేసుకుంది. సూర్య కనిపిస్తే వారు రోలెక్స్ అంటూ గోల చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే:దిల్ రాజు)
కాగా ఎల్‌జీఎం చిత్రంలో ఎంఎస్ ధోనీ ఆ తరహా పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇది ఆయన అభిమానులు సంబరపడే విషయమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని రివీల్ చేయకుండా అభిమానులుకు థ్రిల్ ఇవ్వాలని మేకర్స్ భావించారట. క్రికట్‌లో తన మార్క్ ఎలా అయితే వేశాడో . ఈ సినిమాలో కేవలం 10 నిమిషాల్లో కనిపించినా తన రోల్‌ను మాత్రం ప్రేక్షకులు మరిచిపోలేరని సమాచారం. అలా సూర్యకు రోలెక్స్ ఎలాంటి గుర్తింపు వచ్చిందో.. ధోనికి కూడా ఈ సినిమా అలాంటి గుర్తింపే తెస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment