MS Dhoni's Wife Sakshi Tweets About 'Power Crisis' in Jharkhand, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Sakshi Dhoni: జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య

Published Tue, Apr 26 2022 10:14 AM | Last Updated on Tue, Apr 26 2022 1:31 PM

MS Dhoni Wife Tweets Why There Power Crisis Jharkhand - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని భార్య సాక్షి ధోని జార్ఖండ్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించింది. జార్ఖండ్‌లో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్విటర్‌ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ''ఒక టాక్స్‌ పేయర్‌గా జార్ఖండ్‌ ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందనేది తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మా తరపు నుంచి విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సమస్య ఒక కొలిక్కి రావడం లేదు'' అని పేర్కొంది. 

కాగా గత కొన్నిరోజులుగా జార్ఖండ్‌లో రోజువారి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించిపోతున్నాయి. కరెంట్‌ వినియోగం పెరిగిపోవడం వల్ల లోడ్‌ మార్పు పేరుతో విద్యుత్‌ సిబ్బంది గంటల తరబడి కోత విధిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. 

చదవండి: Rishi Dhawan: ఫేస్‌గార్డ్‌తో పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌.. అసలు కథ ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement