
సాక్షి ధోని, ఎంఎస్ ధోని, అనుష్కశర్మ
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్ ఒకే సీజన్లో రెండో పర్యాయం 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే మిస్టర్ కూల్ కెప్టెన్, బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని (34 బంతుల్లో 70 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) బెంగళూరు బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధోనితో పాటు అంబటి రాయుడు (53 బంతుల్లో 82; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది.
బెంగళూరు, చెన్నై మ్యాచ్ ముగుస్తుందనగా విరాట్ కోహ్లి భార్య అనుష్కశర్మ, ధోని భార్య సాక్షి ధోనిల హావభావాలపై ప్రేక్షకుల దృష్టి సారించారు. కోహ్లి టీమ్ ఓడుతుందని అనుష్క టెన్షన్ పడుతుందగా, ధోని టీమ్ విజయానికి చేరువ అవుతుండటంతో సాక్షి ధోని ఉత్సాహంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ వేశాడు. ఆ ఓవర్ 5వ బంతిని లో ఫుస్‌టాస్‌గా సంధించగా.. తన అనుభవాన్ని ఉపయోగించి ధోని సిక్సర్‌గా మలిచాడు. పలుమార్లు లేచి చప్పట్లు కొడుతూ భర్త ధోనికి మద్దుతు తెలిపిన సాక్షి ధోని.. ఆ సిక్సర్‌ను ఆస్వాధిస్తూ 'వన్ మోర్ సిక్స్' (ఇంకో సిక్సర్ కొట్టు) అంటూ చిన్నస్వామి స్టేడియంలో సందడి చేశారు. చివరి ఓవర్లో నాలుగో బంతిని తనదైన స్టైల్‌లో ధోని సిక్సర్‌గా మలిచి చెన్నైకి విజయాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment