దుబాయ్ : చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ధోని భార్య సాక్షి సింగ్ ఐపీఎల్‌లో అంపైరింగ్ తప్పిదాలపై విమర్శించింది. ఆ వెంటనే తన ట్వీట్‌ను, పోస్ట్‌ను తొలగించింది. రాజస్తాన్, చెన్నైల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ బ్యాట్స్‌మన్ టామ్ కరన్‌ను ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా వేలెత్తాడు. తర్వాత ఇద్దరు అంపైర్లు సమీక్షించుకొని మూడో అంపైర్‌కు నివేదించగా... మూడో కన్ను నాటౌట్‌గా తేల్చింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో సాక్షి సింగ్ స్పందించింది. ‘సాంకేతికతనే వాడాలనుకుంటే సరిగ్గా వాడాలి. ఔట్ అంటే ఔటే. అది క్యాచ్ అయినా ఎల్బీడబ్ల్యూ అయినా? ఔటిచ్చాక తిరిగి మూడో అంపైర్‌కు నివేదించడాన్ని తొలిసారి చూస్తున్నా. కోట్ల మంది వీక్షించే ఐపీఎల్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో అంపైరింగ్ మరింత నాణ్యంగా ఉండాలి’ అని పోస్ట్ చేసింది. కానీ వెంటనే ఈ పోస్ట్‌లను సాక్షి సింగ్ తొలగించింది. (చదవండి: ఆర్చర్ రెచ్చిపోతాడని అప్పుడు ఊహించలేదు)
Comments
Please login to add a commentAdd a comment