ఈ బుజ్జాయి ఎవరో తెలుసా!
సిరులొలికించే చిరునవ్వులొలుకుతున్న ఈ చిన్నారి.. భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ గారాల పట్టి. పేరు జివ. వయస్సు పదినెలలు. చూడగానే భలే ముద్దొస్తున్న ఈ బుజ్జాయి ఫొటోను ధోనీ భార్య సాక్షి ట్విట్టర్‌లో షేర్ చేసింది. జివను ఆశీర్వవందించాలని అభిమానులను కోరింది. గతంలో ఓసారి కూడా జివ ఫొటోను సాక్షి పోస్టుచేసింది. ఆ ఫొటోలో కూతురు జివను ధోని ఎత్తుకొని ఉంటాడు. తాజా ఫొటోలో ముద్దుగా నవ్వుతున్న జివను చూసి ధోనీ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. స్వచ్ఛమైన పసిపాపల నవ్వులకు ఫీదా కానివారు ఎవరుంటారు?!!
Posers daddy n #Ziva !! pic.twitter.com/hYYe4YRUzf
— Sakshi Singh Dhoni (@SaakshiSRawat) November 21, 2015