ఇలా గడ్డం పెంచితే ఆయనను గుర్తుపట్టగలరా? | Mahendra Singh Dhoni New Picture With Daughter Ziva Will Melt Your Heart | Sakshi
Sakshi News home page

ఇలా గడ్డం పెంచితే ఆయనను గుర్తుపట్టగలరా?

Published Sat, Jul 16 2016 2:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

Mahendra Singh Dhoni New Picture With Daughter Ziva Will Melt Your Heart

తాపీగా గడ్డం పెంచి.. ఒడిలో ముద్దుల కూతురుతో ఫొటో దిగిన ఈ పెద్ద మనిషి ఎవరా అనుకుంటున్నారా? భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ తన గారాలపట్టి జివాతో ఇదిగో ఇలా ఫొటో దిగాడు. మరీ ఈ ఫొటోలో ధోనీకి అంత గడ్డం ఎలా వచ్చింది.. ఎప్పుడు పెంచాడు ఆ గడ్డాన్ని అనే కదా! మీ డౌట్..

ధోనీ ఏళ్లకు ఏళ్లు కృషి చేసి పెంచిన గడ్డం కాదది. అంటించికున్న గడ్డం. అదే మన పౌరాణిక నాటకాల్లో వేషలు వేసేటప్పుడు రుషులు గడ్డాలు తగిలించుకుంటారు కదా! అదే తరహాలో ధోనీ కూడా నకిలీ గడ్డాన్ని తగిలించుకొని.. ముద్దుల కూతుర్ని ఒళ్లు కూచొపెట్టుకొని ఇలా ఫన్నీ ఫొటో దిగాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో అభిమానులతో పంచుకున్నాడు.

ధోనీ గారాలపట్టి జివా గురించి అభిమానులకు తెలిసిందే. తన ముద్దుల కూతురు ఫొటోలను అప్పుడప్పుడు ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టుచేస్తూ అభిమానులన్ని సంతోష పెడుతుంటాడు ధోనీ.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement