ధోనీ ముద్దుల పట్టి 'జివా' ఫస్ట్ లుక్ | dhoni's wife sakshi tweets first picture of daughter ziva | Sakshi
Sakshi News home page

ధోనీ ముద్దుల పట్టి 'జివా' ఫస్ట్ లుక్

Published Wed, Mar 4 2015 1:48 PM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

ధోనీ ముద్దుల పట్టి 'జివా' ఫస్ట్ లుక్

ధోనీ ముద్దుల పట్టి 'జివా' ఫస్ట్ లుక్

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముద్దుల పట్టి 'జివా' తొలి ఫోటో సామాజిక వెబ్సైట్లలో హల్ చల్ చేస్తోంది. ధోనీ సతీమణి సాక్షి గత నెల 6వ తేదీన గుర్గావ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  నెలరోజులకు ముందే... బుజ్జిపాప 'జివా' ఫోటోను సాక్షి తన ట్విట్టర్లో మార్చి 2వ తేదీన పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలో జివా...అమ్మ చేతిని మృదువుగా పట్టుకుని ఉంది. జివా అనేది పర్షియన్ భాషకు చెందిన పదం. ఈ పదానికి అర్థం 'అందం'. సాక్షి సింగ్ ...తన గారాల పట్టి ఫోటో పోస్ట్ చేసి ...ఆ ఫోటో కింద 'Bundle of JoY!! అంటూ రాసింది. కాగా సాక్షి మాత్రం తన చిన్నారితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ...ధోనీ మాత్రం వరల్డ్ కప్ టోర్నమెంట్లో బిజీగా ఉన్నాడు. కూతురు పుట్టినా... మన కెప్టెన్ మాత్రం ముందు ఆట... తర్వాతే ఏదైనా అన్న విషయం తెలిసిందే. 2010లో ధోనీ సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement