ధోనీ భార్య షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ లో బిజీ బిజీ గా ఉన్నా, ఆయన భార్య సాక్షి సింగ్ మాత్రం మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ పాపాయిని అల్లారుముద్దుగా పెంచుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ లో ఆమె పలుసార్లు స్పందించారు కూడా. ఇపుడు తాజాగా మరో ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు. రైజింగ్ గుజరాత్ లయన్స్ పై ధోనీ సారధ్యంలోని పూనే సూపర్ గెయింట్స్ ఓడిపోవడం, రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి బ్రాండ్ అంబాసిడర్ గా ధోనీ రాజీనామా లాంటి అంశాలతో ఒత్తిడిలో ఉన్న ధోనీ తన ముద్దుల కుమార్త జియా తో సేద తీరుతున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై లైఫ్ కాప్షన్ తో ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ పోటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
కాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి అంబాసిడర్ పదవికి గుడ్‌బై చెప్పడం పలువురి ప్రశంసలకు నోచుకుంది.నోయిడాలోని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ బాధితులే కాకుండా సహచర టీమిండియా క్రికెటర్లు కూడా ధోనీ నిర్ణయాన్ని కొనియాడుతున్న సంగతి తెలిసిందే.
My life !!! pic.twitter.com/Zv4R06vHGr
— Sakshi Singh Dhoni (@SaakshiSRawat) 15 April 2016