ధోని బైక్‌ మ్యూజియం చూశారా? | Have You Seen MS Dhonis Lavish Bike Museum? | Sakshi
Sakshi News home page

ధోని బైక్‌ మ్యూజియం చూశారా?

Published Sat, Aug 11 2018 12:24 PM | Last Updated on Sat, Aug 11 2018 12:31 PM

Have You Seen MS Dhonis Lavish Bike Museum? - Sakshi

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే గుర్తొచ్చేది బైక్‌ సవారీనే.

రాంచీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే గుర్తొచ్చేది బైక్‌ సవారీనే. ఎందుకంటే ధోనికి బైక్‌లంటే అంత ఇష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ధోని భార్య సాక్షి కూడా ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

‘ధోనీ అమితంగా ప్రేమించే టాయ్స్‌’ అంటూ సాక్షి ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటో ఏంటో తెలుసా. బైక్స్‌ మ్యూజియం. ఈ ఫొటో ఎక్కడిది అన్నది మాత్రం సాక్షి చెప్పలేదు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో చూసిన అభిమానులు మాత్రం ఇది ‘ధోని బైక్‌ మ్యూజియం, రాంచీలోని తన ఇంటి ప్రాంగణంలో ధోని ఏర్పాటు చేసుకున్న బైక్‌ మ్యూజియం ఇదే’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ధోని వద్ద చాలా బైకులు ఉన్న సంగతి మనకూ తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement