ధోని బైక్ మ్యూజియం చూశారా?
రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే గుర్తొచ్చేది బైక్ సవారీనే. ఎందుకంటే ధోనికి బైక్‌లంటే అంత ఇష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ధోని భార్య సాక్షి కూడా ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
‘ధోనీ అమితంగా ప్రేమించే టాయ్స్’ అంటూ సాక్షి ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటో ఏంటో తెలుసా. బైక్స్ మ్యూజియం. ఈ ఫొటో ఎక్కడిది అన్నది మాత్రం సాక్షి చెప్పలేదు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో చూసిన అభిమానులు మాత్రం ఇది ‘ధోని బైక్ మ్యూజియం, రాంచీలోని తన ఇంటి ప్రాంగణంలో ధోని ఏర్పాటు చేసుకున్న బైక్ మ్యూజియం ఇదే’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ధోని వద్ద చాలా బైకులు ఉన్న సంగతి మనకూ తెలిసిందే.