ధోనీ భార్యకు కోపం వచ్చింది.. | Sakshi Dhoni got 'angry' at Indian supporters | Sakshi
Sakshi News home page

ధోనీ భార్యకు కోపం వచ్చింది..

Published Sun, Mar 20 2016 1:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

ధోనీ భార్యకు కోపం వచ్చింది..

ధోనీ భార్యకు కోపం వచ్చింది..

రాంచీ : గత రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టి 20 మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలిచిన ఆనందంలో క్రికెట్ అభిమానులంతా సంబరాలు జరుపుకోగా ధోనీ సతీమణి సాక్షికి మాత్రం చిరు కోపం వచ్చిందట.. అది కూడా భారత్ అభిమానులపై!  అంత చిరాకు పెట్టేలా అభిమానులు ఏం చేసుంటారనుకుంటున్నారా ? ధోనీ గారాల పట్టి జీవాకు నిద్రా భంగం కలిగించారు.

భారత్ మ్యాచ్ గెలిచిన సంబరంలో కొందరు అభిమానులు ధోనీ ఇంటి ముందు బాణా సంచా పేల్చి హంగామా చేయడం మొదలుపెట్టారు.అప్పటికే బాగా పొద్దు పోవడంతో సాక్షి కాస్త ఇబ్బంది పడ్డారు. పాప నిద్ర లేస్తుందని చెప్తూ చిరు కోపాన్ని ట్విట్టర్ లో ప్రదర్శించారు!

టీం ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూనే.. ఇంటి ముందు హంగామాను కూడా వివరించారు. 'మీరంతా కలిసి నా చిన్నారిని నిద్ర లేపేలా ఉన్నారు. నేను తప్పకుండా ఏదో ఒక రోజు భారత్-పాక్ మ్యాచ్ గురించి పాపకు చెప్తాను, కానీ ఇప్పుడు తను చాలా చిన్నపిల్ల కదా.. ఏం జరుగుతుందో, వాళ్ల నాన్న ఎవరో .. ఇవేమీ పాపకు అర్థం కావు' అంటూ ట్వీట్ చేశారు సాక్షి సింగ్ ధోనీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement