IPL 2021: Dhoni Wife Sakshi Gets Emotional - Sakshi
Sakshi News home page

MS Dhoni: తల.. అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాం.. ఇప్పుడు మాత్రం!

Published Mon, Oct 11 2021 8:34 AM | Last Updated on Mon, Oct 11 2021 11:59 AM

IPL 2021: Dhoni Wife Sakshi Gets Emotional After His Match Winning Performance

భార్య సాక్షి, కూతురు జీవాతో ధోని(ఫైల్‌ ఫొటో)

MS Dhoni Wife Sakshi Dhoni in Tears: గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌... ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. తొమ్మిదవసారి తుది పోరుకు అర్హత సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కెప్టెన్‌ ధోని.. చివరి ఓవర్‌లో వరుస బౌండరీలు బాది... తన స్టైల్‌లో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి జట్టును విజయతీరాలకు తీర్చడంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆనందంతో మునిగితేలుతున్నారు. ‘‘తల... ఈ గెలుపు చిరనస్మరణీయం.  గతేడాది బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాం.. ఇప్పుడు నీ ఇన్నింగ్స్‌ చూసి ఆనందభాష్పాలు ఆగడం లేదు. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’’అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్‌గా మారాయి.

ఇక వీటన్నింటిలో ధోని భార్య సాక్షి ధోని ఫొటో హైలెట్‌గా నిలిచింది. ధోని.. బౌండరీ బాది చెన్నై గెలుపును ఖరారు చేయడంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూనే... కరతాళ ధ్వనులతో భర్త విజయాన్ని హర్షించారు. ఈ ఫొటో సీఎస్‌కే అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘సాక్షి మేడమ్‌.. ఈ క్షణంలో మేము కూడా మీలాగే భావోద్వేగాలకు గురయ్యాం. మనందరికీ ఇది ఉద్వేగభరిత క్షణం.

ధోనిని మనమంతా ప్రేమిస్తున్నామనడానికి నిదర్శనం’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2020 సీజన్‌లో చెన్నై ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించగానే సాక్షి.. భావోద్వేగ పోస్టు షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఇది కేవలం ఆట మాత్రమే. అసలైన విజేతలు మీరే’’ అంటూ సూపర్‌కింగ్స్‌కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఈసారి ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలవడంతో ఇలా ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు. ఇక ఆదివారం జరిగిన క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

స్కోర్లు:
ఢిల్లీ క్యాపిటల్స్‌: 172/5 (20)
చెన్నై సూపర్‌కింగ్స్‌: 173/6 (19.4)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement