
Sakshi Dhoni Birthday Celebrations.. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా మెంటార్‌గా బిజీగా గడిపిన ఎంఎస్ ధోని తాజాగా బర్త్‌డే వేడుకల్లో తళుక్కుమన్నాడు. తన భార్య సాక్షి ధోని పుట్టినరోజు కావడంతో రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సాక్షి ధోని చిరకాల స్నేహితురాలు ప్రియాన్షు చోప్రా సహా కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లాక్ టీషర్ట్‌లో రా లుక్‌తో ధోని అదరగొట్టాడు.
చదవండి: AB De Villiers-Kohli: 'ఐ లవ్ యూ ఏబీ'.. నా గుండె ముక్కలయ్యింది
ఇక టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-12 దశలో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన టీమిండియా.. ఆ తర్వాత స్కాట్లాండ్, నమీబియా, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికి వెనుదిరిగింది. కాగా ఐపీఎల్ 2021లో సీఎస్‌కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలో సీఎస్‌కే ట్రోఫీ సాధించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ప్రస్తుతం సాక్షి సింగ్ ధోని ప్రెగ్నెంట్ కావడంతో త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనుంది.