'నాకంటే వీడియో గేమ్స్‌ ఎక్కువయ్యాయా?' | When MS Dhoni Picked Video Games Over Wife Sakshi Dhoni In-Bedroom | Sakshi
Sakshi News home page

Dhoni-Sakshi: 'నాకంటే వీడియో గేమ్స్‌ ఎక్కువయ్యాయా?'

Published Wed, Jul 5 2023 3:46 PM | Last Updated on Wed, Jul 5 2023 3:50 PM

When MS Dhoni Picked Video Games Over Wife Sakshi Dhoni In-Bedroom

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి వీడియో గేమ్స్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన సమయంలోనూ ధోని విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు హోటల్‌ రూమ్స్‌లో ఎక్కువగా వీడియో గేమ్స్‌తోనే కాలక్షేపం చేసేవాడు. ఇటీవలే ఐపీఎల్‌ సందర్భంగా ధోని ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ క్యాండీ క్రష్‌ ఆడుతున్న వీడియోనూ షేర్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.

తాజాగా మంగళవారం(జూన్‌ 4న) ధోని, సాక్షిసింగ్‌ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోని.. ''ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి'' అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసింది. ఆ ఫోటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ చాలా బిజీగా కనిపించాడు.

ఇది చూసిన సాక్షి.. ''బెడ్‌రూంలో కూడా వీడియో గేమ్స్‌ ఆడతావా.. నాకంటే నీకు వీడియో గేమ్‌ ఎక్కువయిందా'' అంటూ ధోని కాళ్లను కొరుకుతున్నట్లుగా ఉంది. ''మిస్టర్‌ స్వీటీ నుంచి అటెన్షన్‌ పక్కకు తప్పిన సమయంలో.. వీడియో గేమ్స్‌ వర్సెస్‌ వైఫ్‌(ముఖ్య గమనిక: ఈ ఫోటోకు అసలైన అర్థం కేవలం మా ఇద్దరి క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే అర్థమవుతుంది)'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక 2010లో డెహ్రాడూన్‌లో ధోని, సాక్షి సింగ్‌ల పెళ్లి జరిగింది. 2015లో  ఈ జంటకు జీవా పుట్టింది. ఇక ధోని నాయకత్వంలోని సీఎస్‌కే ఐపీఎల్‌ 2023 సీజన్‌లో విజేతగా నిలిచింది. అయితే ధోనికి ఇదే లాస్ట్‌ ఐపీఎల్‌ సీజన్‌ అని ప్రచారం జరిగినా.. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని మరో ఏడు, ఎనిమిది నెలల్లో ప్రకటిస్తానని ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం పేర్కొన్నాడు.

చదవండి: #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా

ICC Rankings: వరల్డ్‌ నెం1 టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్‌.. భారత్‌ నుంచి ఒకే ఒక్కడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement