
రాంచీ : ‘బిల్లు నువ్వే కట్టావ్‌గా.. ఆ చెప్పులు కూడా నువ్వే వేయ్’ అనే క్యాప్షన్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫొటోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సతీమణి అడిగిందే ఆలస్యం.. టీమిండియా విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన ధోని ఏమాత్రం అహం చూపకుండా.. అందరి ముందూ అలా సాక్షికి సాయం చేయడం గొప్ప విషయం అని కొందరు ప్రశంసలు జల్లు కురిపించారు.
కానీ మరి కొందరు మాత్రం.. సాక్షిసింగ్‌పై మండిపడుతున్నారు. ‘మంచి మనసున్న ధోనికి భార్యగా నువ్వు అనర్హురాలివి. పబ్లిక్‌గా ఓ దిగ్గజ క్రికెటర్‌తో చెప్పులు వేయించుకుంటావా? ఇది నీకు తగునా?’ అని ఒకరు.. ఇది పద్దతి కాదు ధోని.. మీరొక దిగ్గజ క్రికెటర్. కానీ సేవకుడు మాత్రం కాదు’ అని మరొకరు.. ‘ సాక్షి.. నువ్వు లేడీ బాస్‌గా ఫీలవ్వకూ.. ఆ మంచి మనిషికి కొంచెం గౌరవమివ్వు’ అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండటంతో.. విశ్రాంతిలో ఉన్న ధోని.. ఇటీవల తన భార్య సాక్షిసింగ్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ చెప్పులు పరీక్షించే ప్రయత్నంలో ఇబ్బందిపడ్డ సాక్షికి ధోని సాయం చేశాడు. అతనే స్వయంగా ఆమెకు చెప్పులను వేసి తన సతీమణి మనసును దోచుకున్నాడు. (చదవండి: బిల్లు నువ్వే కట్టావ్‌గా.. షూ నువ్వే వేయ్ : ధోని భార్య)
Comments
Please login to add a commentAdd a comment