ప్రేమంటే ఇదేరా..! | love story in china | Sakshi
Sakshi News home page

ప్రేమంటే ఇదేరా..!

Published Sun, Oct 8 2017 2:11 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

love story in china - Sakshi

తమకు ప్రియమైన వారికోసం ఎంతటి కష్టాన్ని భరించడానికైనా కొందరు వెనుకాడరు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియురాలు హైహిల్స్‌ (ఎత్తైన) చెప్పులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే.. దానిని చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఆమెకు తన చెప్పులు ఇచ్చాడు. ఆమె హైహిల్స్‌ తాను వేసుకున్నాడు. చైనాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. చైనా చాంగ్‌కింగ్‌లో ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆస్పత్రికి వచ్చాడు.

ఈ సందర్భంగా అతను పింక్‌ రంగు హైహిల్స్‌ వేసుకోగా.. అనారోగ్యంతో ఉన్న ఆమె అతని చెప్పులు వేసుకొని కనిపించింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను అతను పలుసార్లు వెన్నుతట్టి ధైర్యం చెప్పాడని, హైహిల్స్‌ వేసుకోవడంలో ఆమె పాదాలకు ఇబ్బందిగా ఉండటంతో అతను ఆ చెప్పులు వేసుకొని.. ఆమెకు తన పాదరక్షలు ఇచ్చాడని ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ‘గ్జీ’అనే మహిళ తెలిపింది.

ఆస్పత్రి నుంచి వెళ్లేటప్పుడు చెప్పులు మార్చుకుందామని ఆమె కోరినా.. అతను ఒప్పుకోలేదని, ఆ జంట ప్రేమ తనను కదిలించిందని గ్జీ పేర్కొంది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిపోయాయి. నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement