వామ్మో.. హై హీల్స్.. ఇట్ రియల్లీ కిల్స్.. | Woman shares photo of bleeding feet to highlight unfair work high heels policy | Sakshi
Sakshi News home page

వామ్మో.. హై హీల్స్.. ఇట్ రియల్లీ కిల్స్..

Published Fri, May 13 2016 11:05 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

వామ్మో.. హై హీల్స్.. ఇట్ రియల్లీ కిల్స్.. - Sakshi

వామ్మో.. హై హీల్స్.. ఇట్ రియల్లీ కిల్స్..

ఒట్టావా: హై హీల్స్.. ఈ మాడ్రన్ డేస్ లో కొందరు మహిళలు, యువతులు ధరించే రకం చెప్పులు, షూస్. అయితే ఈ హై హీల్స్ వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరమని గతంలో ఎన్నో సర్వేల్లో తేలింది. హై హీల్స్  వాడకం వల్ల కాలు కీళ్లు, కొన్ని ఎముకలు పటుత్వం కోల్పోవడం, కొన్నిసార్లు విరిగిపోవడం జరుతుంది. అయితే కెనడాకు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని మహిళా ఉద్యోగుల విషయంలో కాస్త కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. స్నేహితురాలి బాధను చూడలేక ఓ యువతి కొన్ని వాస్తవాలను బయటపెట్టింది.

ఈ ఫొటో చూడండి. ఇది నా ఫ్రెండ్ పరిస్థితి. జాగ్రత్తగా ఈ కాళ్లను పరిశీలించండి. సాక్సులకు ఉన్నది రంగు మాత్రం కాదండి. రక్తంతో సాక్సులు తడిసిపోయాయి' అంటూ ఓ నికోలా గేవిన్స్ అనే యువతి తన ఫ్రెండ్ బాధల్ని మాత్రమే కాదు జోయ్ రెస్టారెంట్ లో ఫీమేల్ ఎంప్లాయిస్ కష్టాలను మన కళ్లకు కట్టినట్లు చూపించింది. అందుకే ఈ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో అక్కడ హల్ చల్ చేస్తోంది. మహిళా ఉద్యోగులకు పనిచేసే దగ్గర కనీస స్వేచ్ఛ లేకుండా పోతుందని వాపోయింది.

కాళ్లకు నిత్యం అలా రక్తం కారడంతో ఇన్ ఫెక్షన్ సోకి ఓ వేలు గోరు కూడా కట్ అయిపోయిందట. పురుష ఉద్యోగులు మాత్రం తమకు ఇష్టం వచ్చిన డ్రెస్సింగ్ ఫాలో అవుతుండగా, మహిళలు మాత్రం కాళ్లకు అంతగా సౌకర్యంగా లేని ఆ హై హీల్ షూస్ ధరించాలి. లేనిపక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తారు. హై హీల్స్ వేసుకోని కారణంగా యూకేలో కూడా కొందరు మహిళల్ని జాబ్ నుంచి తప్పించారని నికోలా గేవిన్స్ ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ విషయంపై పోరాడుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement