వాషింగ్టన్ : తన భార్య మెలానియా ట్రంప్ హై హీల్స్‌పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దేశ ప్రథమ పౌరురాలైన మెలానియాతో పాటు తనకు అధ్యక్ష భవనం అంటే ఎంతో గౌరవమని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెలానియా ఎప్పుడూ సంప్రదాయ వేషధారణలో ఉంటారని ఆమెకు మద్ధతుగా నిలిచారు. వైట్ హౌస్ నుంచి టెక్సాస్‌కు బయలుదేరే ముందు అందరూ మహిళల తరహాలోనే తన భార్య పద్ధతిగా దుస్తులు వేసుకున్నారని, హైహీల్స్ ధరించారని తెలిపారు. విమానంలో ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని మెలానియా స్నికర్స్ మార్చుకున్నారని చెప్పారు.
హరికేన్ హార్వే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకునేందుకు మేము వెళ్లగా తన భార్యపై అనవసరంగా విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ వ్యక్తులకు, వీఐపీలకు వేషధారణలో ఎలాంటి మార్పులు ఉండవని.. అందరూ సమానమేనని భావించాలన్నారు. వాస్తవానికి మెలానియా సంప్రదాయంగానే కనిపించారని, ఆమె హై హీల్స్ లేదా స్నికర్స్ ధరించడమనేది తప్పిదమే కాదన్నారు. అసలు మెలానియా ఏం తప్పు చేసిందో చెప్పాలని ట్రంప్ ప్రశ్నించారు. విమానం నుంచి దిగే సమయంలో మెలానియాకు తెలియకుండానే సౌకర్యంగా ఉంటాయని హై హీల్స్ నుంచి స్నికర్స్‌కు మారారని విమర్శలకు బదులిచ్చారు. గత ఆగస్టులో విధ్వంసం సృష్టించిన హరికేన్ హార్వే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించగా మెలానియా ఆహార్యంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.