ఇంతవరకు మనం గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కిన చాలా మంది గురించి విన్నాం. పైగా వారంతా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డులను సృష్టించారు. ఆ కోవకు చెందినదే ఈ మహిళ కూడా. కానీ ఈ మహిళ చేసిన విన్యాసం చేస్తే కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఆ విన్యాసం చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన ఇక అంతే.
వివరాల్లోకెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంటా మోనికా బీచ్‌లో ఓల్గా హెన్రీ అనే క్రీడాకారిణి హైహిల్స్ ధరించి మరీ తాడుపై నైపుణ్యంగా దూకింది. హైహిల్స్ వేసుకుని నడవాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆమె వాటిని వేసుకుని మరీ ఆగకుండా తాడుపై జంప్ చేసింది.
దీంతో ఆమె ప్రపంచ రికార్డును సృష్టించడమే కాక గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఇది చేయడం చాలా కష్టం అంటూ రకరకాలు పోస్ట్‌లు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment