Malaika Arora Trips In High Heels Gets Trolled By Netizens On Social Media - Sakshi
Sakshi News home page

Malaika Arora : హైహీల్స్‌తో హీరోయిన్‌కు తిప్పలు.. జస్ట్‌ మిస్‌ లేదంటే అంతే!

Published Tue, Dec 28 2021 12:52 PM | Last Updated on Tue, Dec 28 2021 1:17 PM

Malaika Arora Trips In High Heels Gets Trolled By Netizens On Social Media - Sakshi

Malaika Arora Trips In High Heels Gets Trolled By Netizens On Social Media: బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ మలైకా అరోరా మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలె కరిష్మా కపూర్‌ ఇంట్లో పార్టికి హాజరైన మలైకా.. కారు దిగబోతు బ్యాలెన్స్‌ అదుపు తప్పి కిందపడబోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. గ్రీన్‌ కలర్‌ బోల్డ్‌ అవుట్‌ఫిట్‌లో సూపర్‌ స్టైలిష్‌గా కనిపించిన ఆమె హైహీల్స్‌ వేసుకుంది. అయితే కారు నుంచి కిందికి దిగేటప్పుడు మాత్రం బ్యాలెన్స్‌ చేయలేక కిందపడిపడబోయింది.

దీంతో పక్కనే ఉన్న వ్యక్తి ఆమెకు సాయం అందించడంతో సేఫ్‌ అయ్యింది. అనంతరం నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'గంజాయి తాగొచ్చావా', 'అయినా ఈ వయసులో హీ హిల్స్‌ వేసుకుంటే ఇలాగే జరుగుతంది' అంటూ ట్రోలింగ్‌కు దిగారు. మరికొందరు మాత్రం.. అందరి విషయంలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అంటూ మలైకాకు సపోర్ట్‌గా నిలబడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement