అక్కడ హైహీల్స్ నిషేధం
మగువలు అత్యంత ఇష్టంగా ధరించే హైహీల్స్‌ను నిషేధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. కెనడాలోని బ్రిటీస్ కొలంబియా ప్రావిన్స్‌లోని అన్ని పని ప్రదేశాల్లో ఈ నిషేధం విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రత, ఆరోగ్య కారణాల దృష్ట్యా కార్మికుల పాదరక్షల నియంత్రణ చట్టానికి సవరణలు చేసినట్లు గ్లోబల్ న్యూస్ సంస్థ తెలిపింది. పని చేసే సమయంలో మహిళలు ఎక్కువ సేపు హీల్స్ ధరించి పనిచేస్తుండంటంతో ఎక్కువ మంది అనారోగ్యానికి గురౌతున్నారని తెలిపింది. అయితే దీనిపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది వ్యతిరేఖిస్తున్నారు
అయితే కొన్ని సందర్భాల్లో పని చేసే ప్రాంతాల్లో మహిళలు హైహీల్స్ ధరించాల్సిఉంటుందని,వాటిని ఎలా నిషేధిస్తారని ప్రావిన్సియల్ ప్రీమియర్ క్రిష్టి క్లార్క్ ప్రశ్నించారు. గ్రీన్‌పార్టీకి చెందిన నేత పార్లమెంట్‌లో ప్రవేటు బిల్లు ప్రవేశపెట్టడంతో ఈఅంశం వెలుగులోకి వచ్చింది. కెనడాలో ఎక్కువ శాతం మంది మహిళలు హైహీల్స్ ధరించి బార్లు, రెస్టారెంట్లలో పనిచేస్తుంటారు.