హైహీల్స్ వేసుకోండి లేదా ఇంటికెళ్లండి
హైహీల్స్ వేసుకోండి లేదా ఇంటికెళ్లండి
Published Wed, Jan 25 2017 7:12 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
ఇదేమైనా ఫ్యాషన్ షోనా.. రోజూ 2-4 అంగుళాల హై హీల్స్ వేసుకునే ఆఫీసుకు రావాలి. కచ్చితంగా మేకప్ వేసుకోవాలి. తప్పనిసరి మేకప్ను రీఅప్లయ్ చేసుకోవాలి. ఒకవేళ హై హీల్స్ వేసుకోకుండా ఆఫీసుకు వచ్చారో. ఇక వారిపనంతే. వెంటనే ఇంటికి వెనుదిరగడమే. ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? బ్రిటిష్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు పెడుతున్న డ్రస్ కోడ్ అట. సెక్సియెస్ట్ డ్రస్ కోడ్ పరిశ్రమల్లో తీవ్రంగా వ్యాపించిందని యూకే రిపోర్టు పేర్కొంది. హైహీల్స్తో భరించలేని కాళ్ల, కీళ్ల నొప్పులు వస్తున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నా... సెక్సియెస్ట్ డ్రస్ కోడ్ పేరుతో కొన్ని పరిశ్రమల వారు మహిళలు హైహీల్స్ వేసుకునే రావాలని బలవంతం పెడుతున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
హైహీల్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై హెచ్చరికలు వస్తున్నా వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కంపెనీల డ్రస్ కోడ్ స్త్రీ, పురుష ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించాలని బ్రిటన్ సమానత్వ చట్టాలు చెబుతున్నాయి. కానీ హోటల్స్, ట్రావెల్, తాత్కాలిక వర్క్ ఏజెన్సీ, హాస్పిటాలిటీ, రిటైల్ రంగాల్లో ఈ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చట్టసభ్యులు పేర్కొన్నారు. తక్కువ జీతం వచ్చే ఉద్యోగులకు కూడా డ్రస్ కోడ్లో అసమానత్వం చూపిస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.. చట్టాలు ఉల్లంఘిస్తున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
రోజంతా నిల్చునే పనిచేసి ఉద్యోగుల పరిస్థితి హైహీల్స్ నిబంధనతో మరింత ఘోరంగా ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. నికోలా థ్రోప్ అనే ఓ మహిళ ఉద్యోగి హైహీల్స్ వేసుకుని రాలేదని, జీతం లేకుండా వెంటనే ఇంటికి పంపించేశారు. దీంతో ఆ మహిళ హైహీల్స్పై అక్కడ ఉద్యమం ప్రారంభించింది. కచ్చితంగా హైహీల్స్ వేసుకుని రావాలనే దానికి వ్యతిరేకంగా పార్లమెంట్ వెబ్సైట్లో ఫిర్యాదు దాఖలు చేసింది. ఆమెకు మద్దతుగా 1,52,420 సంతకాలు నమోదయ్యాయి. ఆమె ఈ తిరుగుబాటు బ్రిటన్ కార్యాలయాల్లో డ్రస్ కోడ్పై విచారణకు చట్టసభ్యులు దిగొచ్చే స్థాయికి వెళ్లింది.
Advertisement