కలసి ఉంటే కలదు సుఖం | High heels are also a little pain | Sakshi
Sakshi News home page

కలసి ఉంటే కలదు సుఖం

Published Fri, Jun 30 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

కలసి ఉంటే కలదు సుఖం

కలసి ఉంటే కలదు సుఖం

ఫిటిప్స్‌

హై హీల్స్‌ నడకకు అందాన్నిస్తాయి. కొంచెం నొప్పిగా కూడా అనిపిస్తాయి. ఈ నొప్పి.. హీల్స్‌ సరిపడకపోవడం వల్ల కాదు. పాదాల్లోని నరాలపై పడే ఒత్తిడి వల్ల! అయితే, చిన్న టెక్నిక్‌తో ఈ నొప్పిని తప్పించుకుని హై హీల్స్‌తో ఈ భూమిని ఏలేందుకు అమ్మాయిలు సిద్ధం కావచ్చు! ఎలాగంటే... చిన్న టేప్‌ తీసుకోండి. అడ్హెసివ్‌ టేప్, స్కాచ్‌ టేప్, న్యూడ్‌ కలర్‌ మెడికల్‌ టేప్‌.. ఏదైనా సరే. అవన్నీ లైట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. అతికించడానికి, అతికించాక తొలగించడానికీ అవి తేలిగ్గా ఉంటాయి.

ఆ టేప్‌తో బొటన వేళ్ల పక్కన ఉండే రెండు వేళ్లను కలిపి గట్టిగా చుట్టేయండి. తర్వాత మీ పాదాలను హై హైల్స్‌లోకి దూర్చేయండి. ఆ తర్వాత నడవండి.  కొద్దిరోజుల్లోనే మీ హై హీల్స్‌ మీకు మంచి ఫ్రెండ్స్‌ అవుతాయి. అయితే హై హీల్స్‌ వల్ల భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న ఆరోగ్య సమస్యలకు మాత్రం ఈ టేపు టిప్పు ఔషధంలా పనిచేయదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే.  

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement