బేబీ క్యారెట్లు గురించి తెలియని వారుండరు. ఇది తినేందుకు కూడా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ క్యారెట్స్ కంటే ఈ బేబీ క్యారెట్లు తింటే ఎన్నో లాభాలు పొందొగలమని అమెరికా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అందం, ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ బేబీ క్యారెట్లని తేల్చి చెబుతున్నారు. అంత మేలు చేసే ఈ బేబీ క్యారెట్లను చిరుతిండిగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!
శాకాహార ప్రియులకు బెస్ట్ స్నాక్ ఐటెంగా తీసుకునే కాయగూర బేబీ క్యారెట్లు. వీటిని స్నాక్ రూపంలో మరేదైన విధంగా తీసుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడుసార్లు తీసుకుంటే చర్మ కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయని పరిశోధనలో తేలింది. ఈ కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు.
ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించగలవు. ఆక్సికరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెరుగైన చర్మం, రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగ్గా ఉంచుతాయి. అధిక స్థాయి కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ రక్షణతో సంబంధం కలిగి ఉన్నాయని, ఇవి గుండె జబ్బులు, కేన్సర్‌ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పరిశోధకులు చెబుతున్నారు.
చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే..
చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ చెందిన శాస్త్రవేత్తలు సుమారు 60 మంది యువకులపై అధ్యయనం నిర్వహించగా..స్కిన్ కెరోటినాయిడ్ స్కోర్‌లు గణనీయంగా 10.8% పెరిగినట్లు గుర్తించారు. సుమారు వందగ్రాములు బేబిక్యారెట్లు తీసుకుంటేనే మంచి ఫలితాలను చూపించిందని అన్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా వివరించారు. అవేంటంటే..
దృష్టి లోపాన్ని మెరుగుపరుస్తుంది: చూపుని రక్షించడంలో సహాయపడుతుంది. వయస్సు సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది.
ఇది పిత్తస్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వృద్ధ జపనీస్ జనాభాలో దంతాల నష్టం రేటుని అధ్యయనం చేయగా బీటా కెరోటిన్ ఎక్కువగా తీసుకున్న వారిలో దంత సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. అయితే బేబి క్యారెట్లు సాధారణ క్యారెట్లు కంటే తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో అయితే సుమారు నాలుగు వారాల పాటు నిల్వ చేయవచ్చు.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్‌కే..!)
Comments
Please login to add a commentAdd a comment