సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబుకి ఉన్న చర్మ సమస్యల కారణంగా.. ప్రభుత్వ వైద్యుల సూచనల్ని జైలు అధికారులు పాటించేలా ఆదేశించాలంటూ శనివారం రాత్రి హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు బాబు తరపు లాయర్లు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహా బ్లాక్‌లో ఆయన ఉంటున్న ప్రత్యేక గదిలో ఏసీ ఏర్పాటు చేయించాలని జైళ్ల శాఖను ఆదేశించింది.
పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడారు ఏసీబీ న్యాయమూర్తి. చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని వైద్యులు తెలపగా.. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలున్నాయా? అని జడ్జి అడిగారు. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే రకమైన ఆరోగ్య సమస్యలు చంద్రబాబుకి లేవని వైద్యులు, న్యాయమూర్తికి తెలిపారు. దీంతో.. చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.
చంద్రబాబు ఉంటున్న బ్యారక్‌లో ఏసీ ఏర్పాటు చేయించాలని, వైద్యుల సూచనల్ని తప్పకుండా అమలు చేయాలని అధికారుల్ని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద ‘‘కోర్టు ఆదేశాల్ని తూ.చా. తప్పకుండా పాటిస్తామ’ని తెలిపారు. దీంతో ఈ రాత్రికే చంద్రబాబు కోసం ఏసీ(టవర్ ఏసీ) ఏర్పాటు చేయనున్నారు అధికారులు.
చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలు, అసత్యాలు ప్రచారంలోకి రావడంతో.. జైళ్ల శాఖ స్పందించింది. ఆయన్ని పరీక్షించిన వైద్య బృందంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ అనుమానాల్ని నివృత్తి చేయించింది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. ఆయన యాక్టివ్‌గానే ఉన్నారని.. ఆస్పత్రి అవసరం లేదని తెలిపింది. రోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే స్కిన్ ఎలర్జీ కారణంగా కూల్ ఎన్విరాన్‌మెంట్ సిఫార్సు చేశామని వైద్యులు తెలిపారు.
ఆ వెంటనే చంద్రబాబు తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అనారోగ్య లక్షణాలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని.. జైలులో ఏసీ ఏర్పాటు చేయించేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. ఏసీ ఏర్పాటు చేయకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. స్కిన్ ఎలర్జీ కారణంగా చల్లని ప్రదేశంలో చంద్రబాబు ఉంటే సరిపోతుందన్న ప్రభుత్వ డాక్టర్ల సూచనల్ని పిటిషన్‌లో ప్రస్తావించారు బాబు లాయర్లు.
Comments
Please login to add a commentAdd a comment