ఈ చప్పట్లు థియేటర్లలోనూ వినిపిస్తాయి | Is THIS the Story of Dhanush's Thanga Magan? | Sakshi
Sakshi News home page

ఈ చప్పట్లు థియేటర్లలోనూ వినిపిస్తాయి

Published Wed, Dec 2 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

ఈ చప్పట్లు థియేటర్లలోనూ వినిపిస్తాయి

ఈ చప్పట్లు థియేటర్లలోనూ వినిపిస్తాయి

చెన్నై చిన్నది సమంత అదృష్టవంతురాలనే చెప్పాలి. తొలి రోజుల్లో తమిళ చిత్ర పరిశ్రమలో కాస్త తడబడ్డా ఆ తరువాత నిలదొక్కుకుని ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. బానాకాత్తాడి చిత్రంలో రంగప్రవేశం చేసిన సమంత ఆ చిత్రం నటిగా ఆమెను ఆదుకోకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించారు. ఆ అవకాశాన్ని దర్శకుడు గౌతమ్‌మీనన్‌నే కల్పించారు. తెలుగులో తొలి చిత్రం ఏ మాయ చేశావేతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.

ఆ తరువాత వరుస విజయాలతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయ్యారు. అలాంటి సమయంలో కోలీవుడ్‌లో స్టార్ దర్శకుడు శంకర్ ఐ చిత్రం, ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కడల్ చిత్రాల బంపర్ ఆఫర్లలను స్కిన్ అలర్జీ కారణంగా వదులు కోవలసిన పరిస్థితికి గురయ్యారు. ఆ తరుణం కాస్త చింతను కలిగించినా... తమిళంలో సాధించే తీరుతాను అనే ఆత్మ విశ్వాసంతో కృషి చేశారు. తన ప్రయత్నం వమ్ము కాలేదు. సూర్యతో  అంజాన్, విజయ్ సరసన కత్తి వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకున్నారు.

అంజాన్ నిరాశపరచినా కత్తి చిత్రం విజయాన్ని అందించింది. ప్రస్తుతం సమంత ఇక్కడ టాప్ హీరోయిన్. విజయ్, ధనుష్, వంటి స్టార్ హీరోలతో నటిస్తున్నారు. మొదట్లో గ్లామర్‌ను నమ్ముకున్న సమంత ఇప్పుడు నటనా ప్రతిభను చాటుకోవడం పైనే మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందు 10 ఎండ్రత్తుక్కుళ్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒక పాత్రలో విలనీయం ప్రదర్శించి విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నటుడు ధనుష్ సరసన తంగమగన్ చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో ధనుష్ భార్యగా చాలా సహజత్వంతో కూడిన నటనను ప్రదర్శించి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న దర్శకుడు కేఎస్.రవికుమార్, రాధికలతో ప్రశంసా చప్పట్లను కొట్టించుకున్నారట. ఈ విషయాన్ని సమంత చెబుతూ ఇవే చప్పట్టు రేపు చిత్రం విడుదలైన తరువాత థియేటర్లలో వినిపిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమంత ఈ చిత్రంతో పాటు విజయ్‌కు జంటగా తేరి చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement