కొందరూ ఎక్కడకి వెళ్లలన్నా.. 'లేటే'. టైంకి రావడం అన్నది వారి డిక్షనరీలోనే లేదు అన్నట్లు ఉంటుంది వారి వ్యవహారం. ఇక వాళ్లకి లేట్ కామర్స్ అనే ముద్ర కూడా ఉంటుంది. పాపం వాళ్లు రావాలనుకున్నా.. రాలేరు. ఎందువల్లో గానీ వాళ్లకు తెలియకుండానే 'ఆలస్యం' అనేది వారి వెనుకే ఉందన్నట్లు ఉంటుంది వారి స్థితి. చూసేవాళ్లకు కూడా వాళ్లకి ఏమైనా జబ్బా? ఎందికిలా ప్రతిసారి లేటు అని విసుక్కుంటారు. అసలు ఇదేమైన వ్యాధా? మరేదైనానా..
వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..ఇలాంటి స్థితిని 'సమయ అంధత్వం' అంటున్నారు. దీన్ని సమయపాలన లోపం లేదా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని విధానం అని అంటున్నారు. అంతేగాదు దీన్ని వైద్య పరిభాషలో 'శ్రద్ధ లేకపోవడం' లేదా 'హైపర్ యాక్టివిటీ' డిజార్డర్‌గా పేర్కొన్నారు. ఒకరకంగా మానసిక ఆరోగ్య సమస్యలాంటిదేనని చెబుతున్నారు. వారికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం, దీనికి శ్రద్ధ అనేది అస్సలు ఉండకపోవడం కారణంగానే వాళ్లు ఇలా దేనికైనా..లేటుగానే వస్తారని అన్నారు.
ఆఫీస్ దగ్గర నుంచి వారు నిత్యం చేసే ప్రతిపనికి ఇలాంటి వ్యక్తులు ఆలస్యంగానే వెళ్తుంటారని పేర్కొన్నారు. దీంతో వీరు తరుచుగా వ్యక్తుల నిర్లక్ష్యానికి గురవ్వుతారు. స్నేహితులు, బంధువులు కూడా ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచుతారు. ఇంటా, బయట వీరికి గౌరవం అనేదే ఉండదు. పాపం దీంతో వారు కూడా కాస్త అసహనానికి గురవ్వుతారు. అందుకోసం అని ఎంతలా ప్రయత్నించినా..చివరికి ఆలస్యమే అవ్వుతుంది.
ఇలాంటి వ్యక్తులను ముందుగా 'లేటు' అనే పదాన్ని తొలగించుకోవాలని బలంగా అనుకోవాలి. అన్నిట్లకంటే ముందు ఆరోగ్య పరంగా హెల్తీగా ఉండాలి. సమయానికి నిద్రపోవాలి.. ఆ తర్వాత పని అని ఫిక్స్ అవ్వాలి. ఇందకోసం కొద్దిగా సాంకేతికతను వాడుకుంటూ సునాయాసంగా ఆ సమస్యను తొలగించుకోవచ్చు. అలారం పెట్టుకోవడం, ముఖ్యమైన అపాయింట్‌మెంట్‌లు, వెళ్లాల్సిన ప్రాంతాల గురించి వివరాలను ఓ పుస్తకంలో లేదా మొబైల్‌లోని రిమైండర్స్‌లో పొందుపరుచుకోవాలి.
రోజు ఉదయం లేవగానే చేయాల్సినవి ఆ బుక్‌లో చూసుకుని తదనంతరం కార్యక్రమాలను ప్రారంభించాలి. యోగా వంటి వాటితో మనసుని ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉంచుకోవాలి. ఏ పని పెండింగ్‌లో ఉండకుండా ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా ఆలస్యం అనే సమస్యను తేలిగ్గా జయించొచ్చు. అలాగే ఇలాంటి మానసిక సమస్యకు కొన్ని మాత్రలు కూడా ఉన్నాయని, వాటిని వైద్యుని పర్యవేక్షలో..వారి సలహాలు సూచనలు మేరకు వాడితే సాధ్యమైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: అలా చేయడం డైటింగ్ కాదు..ఈటింగ్ డిజార్డర్! అదోక మానసిక సమస్య)
Comments
Please login to add a commentAdd a comment