బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ యానిమల్ మూవీలో విలక్షణమైన నటనతో ఆకట్టుకుని మంచి హిట్‌ని అందుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడు, బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా పిలిచే రణబీర్ ఒక ఇంటర్వ్యూలో తాను నాసల్ డీవియేటెడ్ సెప్టెమ్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా తాను వేగంగా తినడం, మాట్లాడటం వంటివి చేస్తుంటానని అన్నారు. అసలేంటీ వ్యాధి..?,ఎందువల్ల వస్తుందంటే..
రణబీర్ ఫేస్ చేస్తున్న నాసల్ డీవియేటెడ్ సెప్టంని తెలుగులో ముక్కు సంబంధిత విచలనం (సెప్టం)గా చెబుతారు. దీని కారణంగా రెండు నాసికా రంధ్రాలను విభజించే సన్నని గోడ మధ్య భాగం ఒకవైపు వాలుగా ఉంటుంది. ఈ అపసవ్యమైన అమరిక రెండు నాసికా మార్గాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వివిధ సమస్యలకు దారితీస్తుంది.
ఎలాంటి సమస్యలు తలెత్తుతాయంటే..
విచలనం సెప్టం శ్యాసను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. నాసికా రంధ్రాలను వేరు చేసే గోడ(సెప్టం) విచలనం అంటే పక్కకు వాలడం. వల్ల రెండు రంధ్రాలు చిన్నగా లేదా మూసుకుపోయినట్లుగా అయిపోతాయి. దీంతో వాయుప్రసరణ సవ్యంగా ఉండదు. ఒక్కోసారి శ్వాసతీసుకోవడం కూడా కష్టమైపోతుంది.
ఈ సమస్య కారణంగా ఆయా వ్యక్తులు నిద్రా సమసయంలో నోటి శ్వాసపై ఆధారపడుతుంటారు. ఇలా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల.. ఒక్కసారిగా వాయు మార్గాల్లో గాలి ఎక్కువై ప్రతిఘటన ఏర్పడుతుంది. ఈ గాలిని ఊపిరితిత్తుల వరకు నెట్టేందుకు మరింత శక్తి అవసరమవుతుంది. ఫలితంగా గురకకు దారితీసి అబ్స్ట్రక్టివ స్లీప్ ఆప్నియాకు దారితీస్తుంది. ఈశ్వాస లోపం కారణంగా వేగంగా సంభాషించేందుకు కారణమవుతుంది.
ఈ వ్యక్తులో నాసికా రద్దీ ఏర్పుడుతుంటుంది. ఎందుకంటే ఒక వైపు రంధ్రం అత్యంత అధ్వాన్నంగా పనిచేస్తుండమే. పైగా శ్లేష్మం కూడా సరిగా బయటకి రాక సైనస్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే ముక్కు లోపల పొడిబారినట్లు అయిపోయి ముఖం నొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడతారు.
నిర్థారణ..
ఈఎన్‌టీ స్పెషలిస్ట్ వద్ద ఓటోలారిన్జాలజిస్ట్ శారీరక పరీక్ష, నాసికా ఎండోస్కోపీ లేదా సిటీ స్కాన్ వంటి వాటితో ఈ సెప్టం విచలనంని గుర్తిస్తారు. విచలనం తీవ్రతను అనుసరించి చికిత్స ఆధారపడి ఉటుంది.
ఎలా నివారిస్తారు..
దీన్ని నివారించడమే గాని పూర్తిగా నయం కాదు. తేలికపాటి కేసుల్లో ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అలాకాకుండా కాస్త ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కొంటే..డీకాంగెస్టెంట్లు, యాంటిహిస్టామైన్లు, నాసల్ స్ప్రేలతో ఈ వ్యాదిని నిర్వహిస్తారు. అవన్నీ కేవలం సౌకర్యాన్ని అందిస్తాయే తప్ప సవస్యను పూర్తిగా నివారించలేవు.
ఇలాంటి సమస్యతో బాధపడేవారు పొగ తాగటం, పెయింట్ పొగలు, గృహ రసాయనాలు, పరిమళ ద్రవ్యాలు వంటి అలెర్జీ కారకాలకు దూరంగా ఉండాలి. దీన్ని సక్రమమైన జీవనశైలితో అధిగమించొచ్చని చెబుతున్నారు నిపుణులు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో శస్త్ర చికిత్సతో ఆ సెప్టంని సరిచేయడమే ప్రభావవంతమైన పరిష్కారం అని వెల్లడించారు వైద్య నిపుణులు.
(చదవండి: 'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..)
Comments
Please login to add a commentAdd a comment