బరేలీ : ఇస్లాం వ్యతిరేక విధానం ట్రిపుల్ తలాక్ పై తాత్కాలిక నిషేధం అమలులో ఉన్నా... అలాంటి ఘటనలు మాత్రం ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో మరో ట్రిపుల్ తలాక్ వెలుగు చూడగా.. భార్య భర్తల పరస్పర ఆరోపణల నేపథ్యంలో కేసు ఆసక్తికరంగా మారింది.
బరేలీకి చెందిన ఫైరాకు ఆమె భర్త దానిష్ మూడు సార్లు తలాక్ చెప్పేసి విడాకులు ఇచ్చాడు. అయితే తాను ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి హాజరు అయిన క్రమంలోనే భర్త విడాకులు ఇచ్చాడని సదరు మహిళ వాపోతుంది. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని హర్షిస్తూ తాను మోదీ సభకు హాజరయ్యానని కానీ, తన భర్త అది అర్థం చేసుకోవట్లేదని చెబుతున్నారు. అంతేకాదు ఓ ఆంటీతో తన భర్తకి సంబంధం ఉందని.. అందుకే తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించారు. సభ నుంచి రాగానే మోదీ ర్యాలీకి వెళ్లావంటూ తనని, తన కొడుకును కొట్టి ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటివేశాడని ఫైరా ఆరోపిస్తున్నారు.
అయితే భర్త మాత్రం కారణం అది కాదని చెబుతున్నారు. తన భార్య మరో వ్యక్తితో సంబంధం నడుపుతున్న నేపథ్యంలోనే విడాకులు ఇచ్చేశానని, తాను ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నదాంట్లో వాస్తవం లేదంటున్నాడు. ఇస్లాం సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆమె దుస్తులు ధరిస్తోంది. అది నాకు నచ్చలేదు. పైగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఇంక నా భార్యను భరించటం నా వల్ల కాదు. అని భర్త దానిష్ చెబుతున్నాడు. పరస్పర వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎటూ తేల్చలేక దర్యాప్తు ద్వారా చిక్కుముడి విప్పేందుకు బరేలీ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment