అశ్వారావుపేట రూరల్ :
అక్రమ సంబంధం అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని నారంవారిగూడెం శివారు అల్లిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని కుక్కునూరు మండలం చీదర గ్రామానికి చెందిన డి. ప్రేమ్‌కుమార్ (33) ఖమ్మం జిల్లా సారపాకలోని బీపీఎల్‌లో పనిచేస్తున్నాడు. అదే మండలంలోని రారుుగూడెం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ భార్యతో అక్రమ సంబంధం ఉందని భర్తకు అనుమానం. దీంతో ప్రేమ్‌కుమార్‌ను ఎలాగైనా చంపాలని రాజేంద్రప్రసాద్ పథకం పన్నాడు. దీనికి తన బావమరిది సిద్దిని ప్రసాద్ సహాయం తీసుకున్నాడు. పథకంలో భాగంగా అశ్వారావుపేటలో ఆటో కొనుగోలు చేయూలని శుక్రవారం రాజేంద్రప్రసాద్ ప్రేమ్‌కుమార్‌కు ఫోన్‌చేసి రమ్మన్నాడు.
దీన్ని నమ్మిన ప్రేమ్‌కుమార్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై అశ్వారావుపేటకు వచ్చారు. అప్పటికే రాజేంద్రప్రసాద్ బావమరిది సిద్దిని ప్రసాద్ అశ్వారావుపేటలో ఉన్నాడు. అక్కడ నుంచి ముగ్గురూ ఒకే వాహనంపై నారంవారిగూడెం బయలు దేరారు. వారు నారంవారిగూడెం వెళ్లకుండా దారి మార్చి అల్లిగూడెం తోటల వైపు తీసుకెళ్లారు. ఓ అరటి తోట వద్దకు వెళ్లగానే ప్రేమ్‌కుమార్‌పై కత్తితో దాడికి పూనుకున్నారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు ప్రేమ్‌కుమార్ పరుగులు తీసారు. రాజేంద్రప్రసాద్, సిద్దిని ప్రసాద్‌లు వెంబడించి ప్రేమ్‌కుమార్‌ను నరికి చంపారు. అదే సమయంలో తాటి చెట్టుపై కల్లు గీస్తున్న ఓ వ్యక్తి ప్రేమ్‌కుమార్‌పై దాడిని చూసి కేకలు పెట్టాడు. దీంతో అక్కడ ఉన్న పెంపుడు కుక్కలు వారిని వెంబడించాయి. దీంతో సిద్దిని ప్రసాద్ పరారు కాగా, రాజేంద్రప్రసాద్ పొదల్లో దాక్కున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజేంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవికుమార్ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అనుమానంతో హతమార్చాడు
Published Sat, May 21 2016 9:12 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement