ధర్మపురి: నాన్నా.. ఎట్లనో అయితంది.. హాస్పిటల్‌కు పోదాం.. అంటూ విషజ్వరంతో బాధ పడిన ఓ చిన్నారి మృతిచెందింది. పాప మాట లను గుర్తు చేసుకుంటూ త ల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురికి చెందిన కొత్తకొండ రాజు–లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. రా జు స్థానికంగా ఓ రెడీమేడ్ షాపు నిర్వహిస్తుండగా.. తమ పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
మూడో తరగతి చదువుతున్న పెద్ద పాప సమన్వి(8)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చే యించారు. న యం కాకపోవడంతో జగిత్యాల తరలించగా వై ద్యులు విష జ్వరంగా తేల్చారు. చికిత్స తర్వా త కొంత నయం కావడంతో రెండు రోజుల క్రితం డిశ్చార్జి చేయడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మళ్లీ జ్వరం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మనస్వి సోమవారం సాయంత్రం మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment