చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. అలాగని అన్ని చేపలూ తినడానికి పనికొచ్చేవి కాదు. చేపల్లో కొన్ని రకాలు విషపూరితమైనవి కూడా ఉంటాయి. ప్రపంచంలోని విషపూరితమైన చేపల్లోకెల్లా అత్యంత విషపూరితమైన చేప ‘స్టోన్‌ఫిష్’. ఇది ఎక్కువగా సముద్రం అడుగున ఉంటుంది. చూడటానికి అచ్చంగా రాయిలా కనిపిస్తుంది.
సముద్రగర్భంలో డైవింగ్ చేసేవారికి తప్ప ఒడ్డున ఉన్నవారికి ఇది కనిపించడం చాలా అరుదు. డైవింగ్ చేసేవారు దీనిని చూస్తే చేప అనుకోరు. సముద్రం అడుగున ఉండే ఎన్నో రాళ్లలో ఇది కూడా ఒక రాయేనని పొరబడుతుంటారు. పొరపాటున దీనిపైన అడుగు వేసినా, తాకినా ప్రమాదం తప్పదు. స్కార్పియన్‌ఫిష్ జాతికి చెందినది ఈ స్టోన్‌ఫిష్.
ఇది ఎక్కువగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూగినీ, ఆస్ట్రేలియా పరిధిలోని సముద్ర జలాల్లో కనిపిస్తుంది. దీని కాటు అత్యంత విషపూరితమైనది. ఇది కాటు వేస్తే గంటల తరబడి నొప్పితో విలవిలలాడాల్సి వస్తుంది. దీని కాటుకు విరుగుడు మందు కూడా ఇంతవరకు లేదు. ఒక్కోసారి దీని కాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది.
ఈ సంగతి గురించి మీకు తెలుసా?
‘మర్డర్’ అంటే హత్య అనే అర్థమే అందరికీ తెలుసు. అయితే, కాకుల గుంపును కూడా ‘మర్డర్’ అనే అంటారు.
ఇవి చదవండి: ఇదేం చేప కాదు.. నీటిలో దిగితే దానికంటే తక్కువేం కాదు!
Comments
Please login to add a commentAdd a comment