మెక్సికో సిటీ: పాఠశాలలో 57 మంది విద్యార్థులపై విష ప్రయోగం జరిగిన దారుణ సంఘటన మెక్సికోలో వెలుగు చూసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులపై గుర్తు తెలియని పదార్థంతో విష ప్రయోగం చేశారని స్థానిక మీడియాలు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ప్రైవేటు ప్రయోగశాల పరిశోధనల్లో విద్యార్థులకు కొకైన్ పాజిటివ్‌గా తేలినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు.. కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవటం వల్లే తమ పిల్లల ఆరోగ్యం దెబ్బతిందని.. విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విష ప్రయోగం జరిగిన వారిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు.
విద్యార్థులపై విష ప్రయోగం జరగటం రెండు వారాల్లో ఇది మూడో సంఘటన కావటం ఆందోళన కలిగిస్తోంది. బోచిన్ ప్రాంతానికి చెందిన 57 మంది చిన్నారులు విష ప్రయోగం జరిగిన లక్షణాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారని.. ఒక విద్యార్థిని ఉన్నతాసుపత్రికి తరలించగా..మిగిలిన విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని మెక్సికన్ సోషల్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. శనివారం 15 మందిపై విష నిర‍్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం
Comments
Please login to add a commentAdd a comment