తాగునీటిలో విష ప్రయోగం | Sakshi
Sakshi News home page

తాగునీటిలో విష ప్రయోగం

Published Sun, Jun 16 2024 6:01 AM

Poision in drinking water

నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన దుండగులు

సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు

అనంతపురం జిల్లా తుంబిగనూరులో ఘటన

కణేకల్లు: ప్రజలు తాగే నీళ్లలో విషాన్ని కలిపారు.. ఆ నీరు తాగినోళ్లు ప్రాణాలతో ఉండకూడద­నుకున్నారో.. లేక వాంతులు, విరేచనాలొచ్చి నిర్వ­హ­ణ చేసే వారికి చెడ్డపేరు రావాలనుకున్నారో గానీ అ­త్యంత అమానుష ఘటనకు ఒడిగట్టారు. వా­టర్‌ప్లాంట్‌ నిర్వాహకులు సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తుంబిగనూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల కథనం మేరకు వి­వరాలిలా ఉన్నాయి.. తుంబిగనూరులో సుజలాన్‌ ఎ­న­ర్జీ లిమిటెడ్‌.. రెండేళ్ల క్రితం మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి అప్ప­గించింది. 

గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయ­కు­డు ఫణీంద్ర గౌడ్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణ బాధ్య­తలు చూస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబా­టులో ఉండేందుకు తన తండ్రి తిప్పయ్యను ప్లాంట్‌ వద్దే ఉంచారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పంచా­యతీ ఆధ్వర్యంలో రూ.5కే రెండు బిందెల నీటిని పంí­³ణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధ­రాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్ద­రు వ్యక్తులు దుప్పటి కప్పుకుని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ వద్దకు వచ్చారు. కిటికీలు తీసి నీటి ట్యాంకు­లో టెర్మినేటర్‌ పురుగుల మందు కలిపారు. 

అదే స­మ­యంలో బహిర్భూమి కోసం లేచిన తిప్పయ్య ప్లాంట్‌ వద్ద వ్యక్తులు ఉండటాన్ని గమనించి.. ఎవ­రక్కడ అంటూ గద్దించాడు. దీంతో పొరుగున ఉండే తలారి హనుమంతు, కొట్రేగౌడ్‌ నిద్ర లేచి అక్కడికి వచ్చారు. ఇంతలోనే దుండగులు అక్కడి నుంచి పారి­పోయారు. వాటర్‌ప్లాంట్‌ను పరిశీలించగా.. అందులో పురుగుల మందు కలిపినట్టు తేలింది. ఈ ఘట­నను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా తీసుకున్నారు. 

ప్రజల ప్రాణాలతో చెల­గా­టమాడేవారిని ఉపేక్షించొద్దని పోలీసు అధికా­రుల­ను ఆదేశించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీని­వాసులు, కణేకల్లు ఎస్‌ఐ శ్రీనివాసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రంగంలో దింపి ఆధారాలను సేకరించారు. జరిగిన ఘటనపై తిప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎల్లో మీడియాలో దుష్ప్రచారం 
ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ రాలేదన్న ఉద్దేశంతో నేనే కొందరితో తాగునీటిలో విషం కలిపించానంటూ ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం దుర్మార్గం. గ్రామ సర్పంచ్‌గా నేను 365 ఓట్ల మెజార్టీతో గెలిచాను. గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 494 ఓట్లు రాగా.. టీడీపీకి 512 ఓట్లు వచ్చాయి. ఓట్లు వేయలేదని ప్రజలను బెదిరించడం, దౌర్జన్యం చేయడం లాంటివి నేను ఏరోజూ చేయలేదు. ఎల్లో మీడియా నాపై నింద వేయడంబాధాకరం.– ఫణీంద్ర గౌడ్, గ్రామ సర్పంచ్,        తుంబిగనూరు  

Advertisement
 
Advertisement
 
Advertisement