Poisoning of Family In Miyapur - Sakshi
Sakshi News home page

అత్తింటి కుటుంబంపై అల్లుడు విష ప్రయోగం..

Aug 19 2023 7:24 PM | Updated on Aug 19 2023 8:41 PM

Poisoning of Family In Miyapur - Sakshi

హైదరాబాద్‌: మియాపూర్‌లో దారుణం జరిగింది. సొంత అల్లుడే అత్తింటి కుటుంబంపై విషప్రయోగం చేశాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. మిగిలిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్తింటివారిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే బాధిత కుటుంబానికి చెందిన అల్లుడు వారిపై విష ప్రయోగం చేశాడని పోలీసులు తెలిపారు. 

అత్తింటివారిని అంతం చేయాలని పథకం పన్నిన అల్లుడు అజిత్.. వారు తినే ఆహారంలో విషం కలిపాడు. విషయం తెలియక ఆ విష ఆహారాన్ని తిన్న బాధితుల ఆరోగ్యం క్షీణించసాగింది. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసిన నిజానిజాలను పసిగట్టారు. నిందితుడు ముప్పవరపు అజిత్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగుర్ని అరెస్టు చేశారు పోలీసులు. శిరీష తల్లి మహేశ్వరి మృతి చెందింది. ఇతర కుటుంబ సభ్యులకు హస్పిటల్‌లో వైద్యులు చికిత్స చేస్తున్నారు.

ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్‌పూర్‌లో పేలుడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement