సంచలన నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. తను స్థాపించిన సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఇండియా జననాయక పులిగళ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మన్సూర్.. ఇండియా జననాయక పులిగళ్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల గురించి చర్చించడానికి పార్టీ కార్యవర్గ సమావేశం ఇటీవల స్థానిక వలసరవాక్కంలో నిర్వహించారు.
పార్టీ అధ్యక్షుడినే తప్పించారా?
ఆ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా జననాయక పులిగళ్ పార్టీ ఎవరితో కూటమి ఏర్పరచాలన్న అంశం నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రధాన కార్యదర్శి కన్నదాసన్‌కు ఇచ్చేలా తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కన్నదాసన్‌నే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా పార్టీ అధ్యక్ష పదవి నుంచి మన్సూర్ అలీఖాన్‌ను తొలగించేలా కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమ్మతి లేకుండా ఏఐఏడీఎమ్‌కే పార్టీతో పొత్తుకు ప్రయత్నించినందువల్లే మన్సూర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.
ఆఫీస్ బాయ్
దీనిపై నటుడు మన్సూర్ అలీఖాన్ స్పందిస్తూ.. ఇండియా జననాయక పులిగళ్ పార్టీకి కుండ్రత్తూర్ బాలమురుగన్ ప్రధాన కార్యదర్శి అని పేర్కొన్నారు. కన్నదాసన్ అనే వ్యక్తి పార్టీ శాశ్వత సభ్యుడు సెల్వపాండియన్ ద్వారా ఆఫీస్ బాయ్‌గా చేరారన్నారు. ఆఫీస్‌లో రూ. 70 వేలు విలువైన రబ్బర్ స్టాంప్, ఖరీదైన ల్యాప్‌టాప్‌లను అతను దొంగిలించారన్నారు. తర్వాత పార్టీ నాయకుడిగా మారాడు. అయితే ప్రస్తుతం తాను రానున్న ఎన్నికల్లో భాగంగా ఆరణీ, పెరంబలూర్ నియోజక వర్గాల్లో ప్రచారంలో మునిగిపోయానని, ఆ విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు.
చదవండి: రజనీకాంత్ పేరుతో మోసాలు.. రూ. 4 లక్షలు పోగొట్టుకున్న యువతి
Comments
Please login to add a commentAdd a comment